Hostel Hudugaru Bekagiddare: తన వీడియోను తీసేయాలంటూ కోర్టుమెట్లెక్కిన రమ్య..! 18 h ago
'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే' మూవీ లో తన అనుమతి లేకుండా తన వీడియో ని ఉపయోగించారంటూ నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య కోర్ట్ ని ఆశ్రయించారు. చిత్ర నిర్మాతల నుంచి తనకు కోటి రూపాయలు నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరారు. మూవీ నుండి తన వీడియో ను తొలగించాలని పలుసార్లు కోరినా నిర్మాతలు స్పందించలేదని ఆమె ఆరోపించారు. ఆ వీడియోని మూవీ నుండి తొలగిస్తే కేసును వెనక్కి తీసుకుంటానని రమ్య తెలిపారు.